చికిత్స పొందుతున్న బాలిక మృతి | Girl died under treatment | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న బాలిక మృతి

Aug 23 2016 8:27 PM | Updated on Sep 28 2018 3:41 PM

చికిత్స పొందుతున్న బాలిక మృతి - Sakshi

చికిత్స పొందుతున్న బాలిక మృతి

సూర్యాపేటరూరల్‌ : తల్లితో గొడవపడి క్షణికావేశంలో కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న బాలిక చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సూర్యాపేటరూరల్‌ ఎస్‌ఐ జి.శ్రీనువాస్‌రెడ్డి తెలిపారు.

సూర్యాపేటరూరల్‌ : తల్లితో గొడవపడి క్షణికావేశంలో కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న బాలిక చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సూర్యాపేటరూరల్‌ ఎస్‌ఐ జి.శ్రీనువాస్‌రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం మండలంలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన బాషపంగు మహేశ్వరి(16) తల్లి పద్మను కొత్త డ్రస్‌ కొనివ్వమని అడగడంతో ప్రస్తుతం కొనివ్వలేనని చెప్పింది. దీంతో ఆవేశానికి లోనైన మహేశ్వరి జూన్‌ 6న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్‌ పోసుకోని నిప్పంటించుకుంది. గాయాలపాలైన మహేశ్వరిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతున్న మహేశ్వరి మంగళవారం మృతి చెందింది. ఈ మేరకు పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని తల్లి పద్మకు అప్పగించామన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement