జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఆత్మహత్య | ghmc employee balswami suicide at kukatpally | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఆత్మహత్య

Sep 30 2016 10:51 PM | Updated on Mar 10 2019 8:23 PM

ఆత్మహత్యకు పాల్పడిన బాలస్వామి - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన బాలస్వామి

జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది

మలేసియా టౌన్‌షిప్‌: జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఎలిజాల బాలస్వామి కూకట్‌పల్లి సర్కిల్‌ కార్యాలయంలో ఎంటమాలాజీ విభాగంలో ఔట్‌స్సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం ఉదయం  విధులకు హాజరైన బాలస్వామి రమ్య సెంటర్‌ సమీపంలోని వార్డు కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీనిని గమనించిన తోటి ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement