పది కిలోల గంజాయి స్వాధీనం | ganjay seized at peddapalli | Sakshi
Sakshi News home page

పది కిలోల గంజాయి స్వాధీనం

Apr 9 2017 3:21 PM | Updated on Sep 5 2017 8:22 AM

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండులో పది కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండులో పది కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బస్టాండులో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందినవారుగా తేలింది. ప్రసన్న జుత్తురాయ్‌, కమలేష్‌ బొల్లార్‌లు బస్టాండులో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

తాము ఒడిశా నుంచి భద్రాచలం, అక్కడినుంచి గోదావరిఖని వచ్చామని అన్నారు. ఇక్కడినుంచి కరీంనగర్‌ వెళ్లడానికి వేచి ఉన్నట్లు చెప్పారు. వారినుంచి రూ.1.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని వన్‌టౌన్‌ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement