రోడ్డు ప్రమాదంతో గంజాయి గుట్టు రట్టు | ganjai seez | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంతో గంజాయి గుట్టు రట్టు

Sep 27 2016 11:17 PM | Updated on Aug 25 2018 6:21 PM

రోడ్డు ప్రమాదంతో గంజాయి గుట్టు రట్టు - Sakshi

రోడ్డు ప్రమాదంతో గంజాయి గుట్టు రట్టు

రాజానగరం పోలీ సు స్టేషను ప రిధిలోని కొం తమూరులో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంతో గంజాయి అక్రమ రవా ణా గుట్టు రట్టయింది. గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన గామన్‌ బ్రిడ్జి రోడ్డుపై కొవ్వూరు ౖÐð పు వెళ్తున్న లారీని కొంతమూరు వద్ద వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజానగరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద కారణాలను పరిశీలిస్తున్నారు

కొంతమూరు (రాజానగరం ) :
రాజానగరం పోలీ సు స్టేషను ప రిధిలోని కొం తమూరులో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంతో గంజాయి అక్రమ రవా ణా గుట్టు రట్టయింది. గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన గామన్‌ బ్రిడ్జి రోడ్డుపై కొవ్వూరు ౖÐð పు వెళ్తున్న లారీని కొంతమూరు వద్ద వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజానగరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద కారణాలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో కారుకు సంబంధించిన వ్యక్తులు హఠాత్తుగా పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారును సోదా చేశారు. కారు అడుగు భాగంలో నీట్‌గా ప్యాక్‌ చేసి ఉన్న 27 గంజాయి ప్యాకెట్లు (50 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ శంకర్‌నాయక్‌ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
50 కిలోల గంజాయి స్వాధీనం
చింతూరు : ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురు సభ్యులుగల అంతర్రాష్ట్ర ము ఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50 కేజీల గంజాయి, రూ.2.49 లక్షలు, వాహనాన్ని నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మోతుగూడెం వైపు నుంచి భద్రాచలం వైపునకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో చింతూరు సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీనివాస్‌ సిబ్బందితో రత్నాపురం జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుంటే రెండు మూటల్లో గంజాయి లభ్యమైనట్టు సీఐ తెలిపారు. ఒక్కో మూటలో 25 కేజీల చొప్పున 50 కేజీల గంజాయి ఉందన్నారు. గంజాయిని తరలిస్తున్న జార్ఖండ్‌కు చెందిన గణేష్‌కుమార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయప్రకాష్‌ పాండే, బీహార్‌కు చెందిన దయాశంకర్, ఒడిశాకు చెందిన అవినాష్‌ బిశ్వాస్, జయ్‌సింగ్, కాలాచంద్‌ భక్తును అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. స్వాధీనం చేసుకున్న  గంజాయి విలువ రూ.రెండున్నల లక్షలు ఉంటుందని అంచనా. పట్టుబడిన గంజాయిని చింతూరు రేంజ్‌ అధికారి రాఘవరావు, వీఆర్‌వో వెంకటరత్నం సమక్షంలో పంచనామా నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement