వాతావరణ బీమా నిధుల మంజూరు | funds release to insurance | Sakshi
Sakshi News home page

వాతావరణ బీమా నిధుల మంజూరు

Aug 7 2016 12:06 AM | Updated on Oct 1 2018 2:11 PM

ఖరీఫ్‌–2015కు సంబంధించి వాతావరణ బీమా పథకం కింద జిల్లాలోని వేరుశనగ రైతులకు కేవలం రూ.108 కోట్లు పరిహారం మంజూరైనట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌–2015కు సంబంధించి వాతావరణ బీమా పథకం కింద జిల్లాలోని వేరుశనగ రైతులకు కేవలం రూ.108 కోట్లు పరిహారం మంజూరైనట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్ని మండలాలకు ఎంత మంది రైతులకు పరిహారం మంజూరైందనే వివరాలు వెల్లడికాలేదు. గతేడాది వేరుశనగ పంట సాగు చేసిన 5.40 లక్షల మంది రైతులు ప్రీమియం రూపంలో ఏకంగా రూ.94.50 కోట్లు చెల్లించారు. చాలా మంది రైతులకు  చెల్లించిన ప్రీమియం కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు.

పరిహారం మంజూరైన విషయాన్ని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ధనుంజయరెడ్డి ధ్రువీకరిస్తూ గతేడాది హెక్టారుకు సగటున 600 కిలోలకు పైగా  పంట దిగుబడులు వచ్చినందున పరిహారం తగ్గి ఉండొచ్చని విశ్లేషించారు.

Advertisement
 
Advertisement
Advertisement