కారు - లారీ ఢీ : ముగ్గురు మృతి | Four killed in chittoor road accident | Sakshi
Sakshi News home page

కారు - లారీ ఢీ : ముగ్గురు మృతి

Nov 11 2015 9:11 AM | Updated on Aug 30 2018 3:56 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాచిపెంట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాచిపెంట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు... లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారు సహా దంపతులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో చిన్నారి మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement