వ్యక్తి నుంచి దుప్పి స్వాధీనం | Forest beat officer possesses deer from youth says, leave it in Medak forests | Sakshi
Sakshi News home page

వ్యక్తి నుంచి దుప్పి స్వాధీనం

Jun 3 2016 11:04 AM | Updated on Oct 9 2018 5:39 PM

లచ్చపేటలో ఓ వ్యక్తి పెంచుకుంటున్న దుప్పిని అటవీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

దుబ్బాక: లచ్చపేటలో ఓ వ్యక్తి పెంచుకుంటున్న దుప్పిని అటవీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. లచ్చపేటకు చెందిన నిమ్మ శ్రీనివాస్‌కు 8 నెలల కిందట అటవీ ప్రాంతంలో దుప్పి పిల్ల దొరికింది. దాన్ని ఇంటికి తెచ్చి 8 నెలలుగా పాలు పోసి, పచ్చ గడ్డి వేస్తూ పెంచుతున్నాడు. విషయం తెలుసుకున్న బీట్ ఆఫీసర్ రవి కిరణ్ గురువారం లచ్చపేటకు వెళ్లి దుప్పిని స్వాధీనం చేసుకున్నారు. మెదక్ అభయారణ్యంలో దుప్పిని వదిలివేయనున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement