ప్రతి బూత్‌వద్ద జాతీయజెండా ఎగురవేయాలి | Floated the national flag in every booth | Sakshi
Sakshi News home page

ప్రతి బూత్‌వద్ద జాతీయజెండా ఎగురవేయాలి

Aug 24 2016 9:51 PM | Updated on Aug 29 2018 4:18 PM

ప్రతి బూత్‌వద్ద జాతీయజెండా ఎగురవేయాలి - Sakshi

ప్రతి బూత్‌వద్ద జాతీయజెండా ఎగురవేయాలి

నల్లగొండ టూటౌన్‌ : సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జిల్లాలోని అన్ని బూత్‌ల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు.

నల్లగొండ టూటౌన్‌ : సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జిల్లాలోని అన్ని బూత్‌ల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి  అన్నారు. బుధవారం స్థానిక గాంధీ పార్కులో జరిగిన నల్లగొండ నియోజకవర్గ బూత్‌కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జాతీయ జెండా ఎగురవేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ కార్యకర్తలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్‌ వీరెళ్లి చంద్రశేఖర్, ఓరుగంటి రాములు, శ్రీరామోజు షణ్ముక, నూకల వెంకటనారాయణరెడ్డి, పల్లెబోయిన శ్యాసుందర్, బాకి పాపయ్య, గుండగోని గిరిబాబు, పోతెపాక సాంబయ్య, చింత ముత్యాల్‌రావు, బొజ్జ శేఖర్, పెరిక మునికుమార్, జగ్జీవన్‌రామ్‌ తదితరులున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement