
వంట చేస్తుండగా మంటలు అంటుకుని..
వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు పూరింటికి మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
దీంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేలోగానే పీ శీనయ్య, పీ అనీల్, వై మధు ఎస్‌కే గపూర్‌కు చెందిన పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో నాలుగు ఇళ్లలోని టీవీలు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2లక్షలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.