రైస్‌మిల్‌లో అగ్నిప్రమాదం | Fire accident in rice mill at karimnagar district | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్‌లో అగ్నిప్రమాదం

Aug 26 2015 4:17 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రమాదవశాత్తు రైస్మిల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

కరీంనగర్ : ప్రమాదవశాత్తు రైస్మిల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలోని సాయి శ్రీలక్ష్మి రైస్‌మిల్‌లో నేటీ మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఇది గమనించిన రైస్‌మిల్ యజమాని అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 ల క్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని వెల్లడించారు.  పోలీసులు రైస్మిల్ వద్దకు చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement