కెమికల్ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడటంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద గంగాపహాడ్ శివారులో ఉన్న కెమికల్ గోడౌన్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
శంషాబాద్(రంగారెడ్డి): కెమికల్ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడటంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద గంగాపహాడ్ శివారులో ఉన్న కెమికల్ గోడౌన్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.