అశ్వారావుపేటలో రైతుల ఆందోళన | Farmers protests at Aswaraopeta | Sakshi
Sakshi News home page

అశ్వారావుపేటలో రైతుల ఆందోళన

Sep 29 2015 12:46 PM | Updated on Oct 1 2018 2:09 PM

ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట పామాయిల్ గెలలకు నిప్పుపెట్టారు. అనంతరం మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ పార్టీల నేతలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement