విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies after electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

May 17 2016 9:40 AM | Updated on Oct 1 2018 2:44 PM

మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన గాడి కనకయ్య(38) అనే రైతు మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

దౌల్తాబాద్: మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన గాడి కనకయ్య(38) అనే రైతు మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన కనకయ్య మోటారు స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి రైతులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించగా కనకయ్య మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement