అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide in vishaka district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Jun 3 2016 8:51 PM | Updated on Sep 19 2019 2:50 PM

రుణ భారంతో ఆందోళనకు గురైన ఓ అన్నదాత బలవన్మరణం చెందాడు.

చోడవరం: రుణ భారంతో ఆందోళనకు గురైన ఓ అన్నదాత బలవన్మరణం చెందాడు. విశాఖ జిల్లా చోడవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓబులరెడ్డి అప్పలనాయుడు(52)కు ఎకరం పొలం ఉంది. దీనికి తోడు రెండెకరాలు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా వరి, చెరుకు సాగు చేస్తున్నారు. అయితే, పంటల సాగుతో నష్టాలు రావటంతో పెట్టుబడుల కోసం చేసిన రూ.6 లక్షల అప్పు మిగిలింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన అప్పలనాయుడు శుక్రవారం సాయంత్రం పొలంలోనే పురుగు మందు తాగి, చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement