ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య | family commits suicide over debt crisis | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య

Jan 15 2017 6:44 PM | Updated on Sep 5 2017 1:17 AM

మెదక్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

అల్లాదుర్గం(మెదక్‌): మెదక్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ కుటుంబం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అల్లాదుర్గం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన సుభాష్‌(34) అనసూయమ్మ(29) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.


ఈ క్రమంలో ఆదివారం తల్లిదండ్రులు కుమారుడు కిట్టు(12)తో కలిసి గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement