జేఎన్‌టీయూలో పరీక్ష ఫలితాలు విడుదల | exam results release in jntu | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూలో పరీక్ష ఫలితాలు విడుదల

Sep 23 2016 11:05 PM | Updated on Sep 26 2018 3:23 PM

జేఎన్‌టీయూ పరిధిలో ఈ ఏడాది జూన్, జూలైలో నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు పరీక్షల విభాగాధిపతి ప్రొఫెసర్‌ శశిధర్‌ తెలిపారు.

అనంతపురం టౌన్‌ : జేఎన్‌టీయూ పరిధిలో ఈ ఏడాది జూన్, జూలైలో నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు పరీక్షల విభాగాధిపతి ప్రొఫెసర్‌ శశిధర్‌ తెలిపారు. బీటెక్‌ మొదటి సంవత్సరం (ఆర్‌–13), రెండు, మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌–13) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు,  బీటెక్‌ రెండు, మూడు, నాల్గో సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌–07), రెండు, మూడు, నాల్గో సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌05) సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. బీటెక్‌ మొదటి సంవత్సరం (ఆర్‌–07), బీటెక్‌ మొదటి సంవత్సరం (ఆర్‌–05) సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదయ్యాయి. 

బీ పార్మసీ ఒకటవ సంవత్సరం (ఆర్‌13) సప్లిమెంటరీ, బీ ఫార్మసీ రెండు, మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌13) సప్లిమెంటరీ, బీ ఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌(ఆర్‌15), బీ ఫార్మసీ రెండు, మూడు, నాల్గో సంవత్సరం ఒకటవ సెమిస్టర్లు (ఆర్‌07) ఫలితాలు వెల్లడయ్యాయి. బీ ఫార్మసీ మొదటి సంవత్సరం (ఆర్‌07), బీ ఫార్మసీ మొదటి సంవత్సరం (ఎన్‌ఆర్‌) పరీక్ష ఫలితాలు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement