కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ | Clashes Between Students At Kukatpally Jntu | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ

Sep 4 2026 7:03 AM | Updated on Sep 4 2026 7:19 AM

Clashes Between Students At Kukatpally Jntu

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీజ్‌ వేడుకల్లో విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గౌతమి, మంజీరా హాస్టల్‌ విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పరస్పరం దాడులకు దిగడంతో జేఎన్టీయూలో టెన్షన్‌ వాతావరణ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు  పరిస్థితి అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement