breaking news
sasidhar
-
ఫ్యామిలీ ఎంటర్టైనర్
దివంగత నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ (నటుడు నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ తనయుడు) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వం వహించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలు. హన్విక క్రియేషన్ బ్యానర్‌పై బీఎన్ రావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదలకానుంది. శరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మిస్టర్ కింగ్’ నా మొదటి సినిమా. ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్ కావాలి. మా సినిమాని చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అమ్మాయి ఉన్న ప్రతి కుటుంబం, ఆత్మగౌరవం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన మూవీ’’ అన్నారు శశిధర్ చావలి. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్లో చూడాలి’’ అన్నారు బీఎన్ రావు. ఈ కార్యక్రమంలో యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్, కెమెరామేన్ తన్వీర్, నటుడు రాజ్ కుమార్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రవి కిరణ్ చావలి, సంగీతం: మణిశర్మ. -
జేఎన్టీయూలో పరీక్ష ఫలితాలు విడుదల
అనంతపురం టౌన్ : జేఎన్టీయూ పరిధిలో ఈ ఏడాది జూన్, జూలైలో నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు పరీక్షల విభాగాధిపతి ప్రొఫెసర్ శశిధర్ తెలిపారు. బీటెక్ మొదటి సంవత్సరం (ఆర్–13), రెండు, మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్ (ఆర్–13) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు, బీటెక్ రెండు, మూడు, నాల్గో సంవత్సరం ఒకటవ సెమిస్టర్ (ఆర్–07), రెండు, మూడు, నాల్గో సంవత్సరం ఒకటవ సెమిస్టర్ (ఆర్05) సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. బీటెక్ మొదటి సంవత్సరం (ఆర్–07), బీటెక్ మొదటి సంవత్సరం (ఆర్–05) సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదయ్యాయి. బీ పార్మసీ ఒకటవ సంవత్సరం (ఆర్13) సప్లిమెంటరీ, బీ ఫార్మసీ రెండు, మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్ (ఆర్13) సప్లిమెంటరీ, బీ ఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటవ సెమిస్టర్(ఆర్15), బీ ఫార్మసీ రెండు, మూడు, నాల్గో సంవత్సరం ఒకటవ సెమిస్టర్లు (ఆర్07) ఫలితాలు వెల్లడయ్యాయి. బీ ఫార్మసీ మొదటి సంవత్సరం (ఆర్07), బీ ఫార్మసీ మొదటి సంవత్సరం (ఎన్ఆర్) పరీక్ష ఫలితాలు ప్రకటించారు.