వైభవంగా ఎర్రితాతస్వామి ఉట్ల పరుష | erritatasvami utla parusha | Sakshi
Sakshi News home page

వైభవంగా ఎర్రితాతస్వామి ఉట్ల పరుష

Mar 6 2017 11:18 PM | Updated on Jul 11 2019 7:48 PM

వైభవంగా ఎర్రితాతస్వామి ఉట్ల పరుష - Sakshi

వైభవంగా ఎర్రితాతస్వామి ఉట్ల పరుష

మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎర్రితాత స్వామి ఉట్లపరుష సోమవారంతో ముగిసింది.

 రాప్తాడు :  మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎర్రితాత స్వామి ఉట్లపరుష సోమవారంతో ముగిసింది.  ఆలయంలో తెల్లవారుజామునే ఎర్రితాత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పరుషకు కనగానపల్లి, ఆత్మకూరు, అనంతపురం, ధర్మవరం తదితర మండలాల నుంచే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి, మొక్కులను తీర్చుకున్నారు. ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద సందడి నెలకొంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.  
 
 ప్రత్యేక పూజలు :  ఎర్రితాత స్వామి ఉట్లపరుషను  అయ్యవారిపల్లి గ్రామస్తులు, భక్తులు   ఆలయంలో వినాయకుడు, శ్రీరాముడు, ఎర్రితాతస్వామి, గోటుకూరుప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement