ఈపీడీసీఎల్‌ సీఎండీగా నాయక్‌ | Epdcl CMD Nayak | Sakshi
Sakshi News home page

ఈపీడీసీఎల్‌ సీఎండీగా నాయక్‌

Jul 28 2016 1:04 AM | Updated on Sep 4 2017 6:35 AM

ఈపీడీసీఎల్‌ సీఎండీగా నాయక్‌

ఈపీడీసీఎల్‌ సీఎండీగా నాయక్‌

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విజయనగరం జిల్లా కలెక్టర్‌ ముదావత్‌ ఎం.నాయక్‌ నియమితులయ్యారు.

  • విజయనగరం నుంచి విశాఖకు బదిలీ
  • సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విజయనగరం జిల్లా కలెక్టర్‌ ముదావత్‌ ఎం.నాయక్‌ నియమితులయ్యారు. ఇంతకుముందు సీఎండీగా పని చేసిన రేవు ముత్యాలరాజు ఈ నెల 22న నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్‌చార్జి సీఎండీగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నివాస్‌ను నియమించారు. ఆయన ఆ బాధ్యతలు చేపట్టకముందే.. రెగ్యులర్‌ సీఎండీగా నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నాయక్‌ గుంటూరు జిల్లా చిలకూరిపేటలోని సుగాలి కాలనీలో జన్మించారు.
     

Advertisement
 
Advertisement
Advertisement