మండలంలోని మాదన్నపేట మత్తడి వద్ద బల్సూకూరి కృష్ణ (35) మూడు రోజుల క్రితం గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ ఆదివారం నర్సంపేట టౌన్ సీఐ జాన్‌దివాకర్, ఎస్సై హరికృష్ణతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన యువకుడి కోసం గాలింపు
Sep 26 2016 12:17 AM | Updated on Sep 4 2017 2:58 PM
నర్సంపేటరూరల్: మండలంలోని మాదన్నపేట మత్తడి వద్ద బల్సూకూరి కృష్ణ (35) మూడు రోజుల క్రితం గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ ఆదివారం నర్సంపేట టౌన్ సీఐ జాన్‌దివాకర్, ఎస్సై హరికృష్ణతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పడుతున్నాయని, యువకులు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమాఖ్య జిల్లా అ«ధ్యక్షుడు ఆబోతు రాజు, కార్యదర్శి ఆబోతు సతీష్, సంగినేని లకన్, నిఖిల్, పైండ్ల గగన్, కుమార్, దాసరి శ్రీకాంత్, రాజేష్, రమేష్, యేగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement