madannapeta
-
మాదన్నపేటలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మాదన్నపేటలో కరోనా వైరస్ కలకలం రేగింది. తొలి సారిగా ఓ అపార్ట్మెంట్లో 25 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం 50 మందికి పరీక్షలు చేయగా... వీరిలో 'సగం మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 11 నెలల పసికందుతో పాటు ఓ గర్భిణి స్త్రీ కూడా ఉంది. మరో ఐదుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఒకేసారి భారీ కేసులు నమోదుకావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. (చదవండి : మరోసారి మానవత్వాన్ని చాటుకున్న అక్షయ్) మాదన్నపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు వేలకు పైగా నర్సులతో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ అపార్ట్మెంట్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పుట్టిన రోజు వేడుకలో నిర్వహించడం వల్ల కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరైన ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురికి పాజిటివ్ నిర్దారణ అయిoది. ( చదవండి : కరోనా నుంచి కోలుకున్న డాక్టర్‌కు బెదిరింపులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1401284236.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గల్లంతైన యువకుడి కోసం గాలింపు
నర్సంపేటరూరల్: మండలంలోని మాదన్నపేట మత్తడి వద్ద బల్సూకూరి కృష్ణ (35) మూడు రోజుల క్రితం గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ ఆదివారం నర్సంపేట టౌన్ సీఐ జాన్‌దివాకర్, ఎస్సై హరికృష్ణతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పడుతున్నాయని, యువకులు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమాఖ్య జిల్లా అ«ధ్యక్షుడు ఆబోతు రాజు, కార్యదర్శి ఆబోతు సతీష్, సంగినేని లకన్, నిఖిల్, పైండ్ల గగన్, కుమార్, దాసరి శ్రీకాంత్, రాజేష్, రమేష్, యేగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.