ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు | engineering student phani kumar drowned in river | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు

Jul 29 2016 1:42 PM | Updated on Sep 4 2017 6:57 AM

ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు.

తాడేపల్లిగూడెం: ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మాకా ఫణికుమార్ (21)  స్థానిక వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

ఈక్రమంలో ఈ రోజు సాయిబాబా గుడి సమీపంలోని ప్రధాన కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి.... ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఫణికుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి... ఫణికుమార్ కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement