వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | Employed laborer died from heat exhaustion | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

Apr 18 2017 12:09 AM | Updated on Jun 1 2018 8:39 PM

కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ఉపాధి కూలీ బండి లక్ష్మీదేవి (45) వడదెబ్బతో సోమవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు...

కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ఉపాధి కూలీ బండి లక్ష్మీదేవి (45) వడదెబ్బతో సోమవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు... లక్ష్మీదేవి శనివారం ఉపాధి పనికి వెళ్లింది. ఎండలోనే పని చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత నీరసంగా ఉండడంతో స్థానికంగా ఉన్న వైద్యునితో చూపించుకుంది. ఆదివారం ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి ప్రభుత్వాన్ని కోరారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement