విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు | Electrical substation Obsession by farmers | Sakshi
Sakshi News home page

విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

Mar 25 2016 11:42 AM | Updated on Oct 3 2018 7:02 PM

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను స్థానిక రైతులు శుక్రవారం ముట్టడించారు.

తుని: తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను స్థానిక రైతులు శుక్రవారం ముట్టడించారు. నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందించకపోవడంతో శుక్రవారం సుమారు 100 మంది రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. అయితే, సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement