తిరుమల వద్ద లోయలో పడిన జీపు: 8 మందికి గాయాలు | Eight injured in road accident in tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల వద్ద లోయలో పడిన జీపు: 8 మందికి గాయాలు

May 5 2016 4:25 PM | Updated on Aug 30 2018 4:07 PM

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 18వ మలుపు వద్ద గురువారం భక్తులతో వెళ్తున్న జీపు లోయలో పడింది.

తిరుపతి : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 18వ మలుపు వద్ద గురువారం భక్తులతో వెళ్తున్న జీపు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను లోయలో నుంచి వెలికి తీసి... తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement