టీటీడీ నిఘా వ్యవస్థపై భక్తుల్లో ప్రశ్నలు
తిరుమల: శ్రీవారి ఆల య పవిత్రతను టీటీడీ గాలికొదిలేసింది. అలిపిరి మెట్ల మార్గంలో తిరు మలకు చేరువగా ఉన్న 2,600వ మెట్టు ప్రాంతంలో కొందరు వ్యక్తులు సిగరెట్లు, బీడీలు తాగుతుండటం కలకలం రేపుతోంది. ఈ పరిస్థితితో తిరుమలలో నిషేధిత వస్తువుల నియంత్రణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుమలలో పొగాకు ఉత్పత్తుల వినియోగం, విక్రయంపై నిషేధం ఉన్నప్పటికీ.. అలిపిరి మార్గంలోనే కొందరు యథేచ్ఛగా సిగరెట్లు, బీడీలు తాగుతుండటంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల పవిత్రతను కాపాడటంలో భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కాగా అలిపిరి నడక మార్గంలో ఓ వ్యక్తి ధూమపానం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.


