విజ్ఞప్తులపై అలసత్వం వద్దు | dont neglete on public complaints | Sakshi
Sakshi News home page

విజ్ఞప్తులపై అలసత్వం వద్దు

Aug 29 2016 11:38 PM | Updated on Mar 19 2019 6:59 PM

వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ - Sakshi

వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేసే విజ్ఞప్తులపై అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్‌ డీఎస్‌. లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

  • గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేసే విజ్ఞప్తులపై అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్‌ డీఎస్‌. లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డే సందర్బంగా ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. 666 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ దేవరాజన్‌ దివ్య, ఏజేసీ శివశ్రీనివాస్, జెడ్పీసీఈఓ మారుపాక నాగేష్, డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఆంజనేయశర్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    • –గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులు కొన్ని..
    • – కల్లూరును రెవెన్యూ డివిజన్‌ కేంద్రం చేయాలని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు లక్కినేని రఘు, ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పీటీసీ లీలావతి విన్నవించారు. 
    • – ఖమ్మంలో సఫాయి కార్మికుల కుటుంబాల్లో 600 మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని, సులభ్‌ కాంప్లెక్స్‌ ద్వారా వీరికి పని కల్పించాలని జిల్లా సఫాయి సొసైటీ వారు వినతిపత్రం సమర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement