జీజీహెచ్‌లో వైద్యుల బాహాబాహీ


కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : 

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఇద్దరు వైద్యుల మధ్య సాగుతోన్న ఆధిపత్య పోరు సోమవారం బాహాబాహీకి దారితీసింది. తొండంగి మండలం నుంచి పాముకాటుకు గురైన యనమల తాతారావును ఈ నెల7న జీజీహెచ్‌కు బంధువులు తీసుకొచ్చారు. మెడికల్‌ వార్డులోని ఏఎంసీలో వెంటిలేటర్‌లో ఉంచి ఇతడిని వైద్యం ఆర్‌ఎంఓ డాక్టర్‌ సుధీర్‌ అందించారు. తనకు చెప్పకుండా రోగిని ఈ వార్డులోకి చేర్చడంపై ఆర్‌ఎంఓ సుధీర్‌ను ఆ యూనిట్‌ విభాగాధిపతి డాక్టర్‌ సత్యనారాయణ నిలదీశారు. దీంతో సోమవారం ఉదయం సూపరింటెండెంట్‌ చాంబర్‌లో పంచాయితీ పెట్టారు. వివరణ ఇస్తున్న క్రమంలో ఆర్‌ఎంఓతో డాక్టర్‌ సత్యనారాయణ వాగ్వాదానికి దిగారు. ఆర్‌ఎంఓపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ బాహాబాహీకి దిగారు.  పరుష పదజాలంతో దూషించి దాడికి యత్నించినట్టు డాక్టర్‌ సత్యనారాయణపై స్థానిక వ¯ŒS టౌ¯ŒS పోలీస్‌స్టేష¯ŒS సీఐ ఏఎస్‌ రావుకి ఫిర్యాదు చేసినట్టు ఆర్‌ఎంఓ తెలిపారు. ఆర్‌ఎంఓగా బాధ్యతలు తీసుకునే ముందు తన గదికి తాళం వేసినట్టు ఆయన తెలిపారు. ఈ విషయమంపై కలెక్టర్, ఆస్పత్రి చైర్మ¯ŒS అరుణ్‌కుమార్‌కి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top