టిప్పర్‌ నుంచి డీజిల్‌ చోరీ | diesel theft in tippar | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ నుంచి డీజిల్‌ చోరీ

Oct 4 2016 11:33 PM | Updated on Sep 4 2017 4:09 PM

టిప్పర్‌ నుంచి డీజిల్‌ చోరీ

టిప్పర్‌ నుంచి డీజిల్‌ చోరీ

అర్వపల్లి: అర్వపల్లి మండల కేంద్రంలోని భారత్‌ పెట్రోలియం బంక్‌ పక్కన నిలిపి ఉన్న టిప్పర్‌ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్‌ చోరీ చేశారు.

అర్వపల్లి:
అర్వపల్లి మండల కేంద్రంలోని భారత్‌ పెట్రోలియం బంక్‌ పక్కన నిలిపి ఉన్న టిప్పర్‌ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్‌ చోరీ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం....జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్సింగ శ్రీనివాస్‌గౌడ్‌ తన టిప్పిర్‌ వాహనాన్ని సోమవారం రాత్రి పెట్రోలియం బంక్‌ పక్కన పెట్టి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి వాహనాన్ని తీయబోగా స్టార్ట్‌ కావడం లేదు. అనుమానం వచ్చి టిప్పర్‌ ట్యాంక్‌ను చూడగా తాళం పగులగొట్టి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంక్‌ తాళం తీసి అందులోని 85 లీటర్ల డీజిల్‌ను చోరీ చేశారు. ఎస్‌ఐ ఎ.మోహన్‌రెడ్డి సంఘటన స్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement