శ్రీవారి సేవలో ప్రముఖులు | devotee rush in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Jun 9 2016 9:02 AM | Updated on Sep 4 2017 2:05 AM

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు కుటుంబసభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే టాలీవుడ్ హీరో నారా రోహిత్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని వారు దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

అలాగే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు,ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీనివాసుని 77,906 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement