క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి | Develop the skills of the sport | Sakshi
Sakshi News home page

క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Oct 15 2016 11:41 PM | Updated on Oct 16 2018 6:15 PM

క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి - Sakshi

క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక జార్జికారొనేషన్‌ క్లబ్‌లో 62వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 రైఫిల్‌ షూటింగ్‌లో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.

ప్రొద్దుటూరు కల్చరల్‌:  క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక జార్జికారొనేషన్‌ క్లబ్‌లో 62వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–19 రైఫిల్‌ షూటింగ్‌లో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, నిత్యం క్రీడా సాధన చేసి జాతీయ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజు, ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 సెక్రటరీ విజయప్రసాదరెడ్డి, జూనియర్‌ కాలేజి అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ వెంకటరెడ్డి, జార్జికారొనేషన్‌ క్లబ్‌ కార్యదర్శి మార్తల సుధాకర్‌రెడ్డి, రీజనల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణ, పోటీల ఆర్గనైజర్‌ శ్రీనివాసులరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు రాఘవ, ప్రసాదరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, అంకాల్‌రావు, జిలానీబాషా తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే:
    ఏయిర్‌రైఫిల్‌ బాలుర విభాగంలో ఎన్‌కెఎం సాయి, సుచందర్‌ (ఈస్ట్‌గోదావరి), ధుల్కి హుసేనయ్య (కడప), బి.హర్షవర్ధన్‌రెడ్డి (గుంటూరు), ఏయిర్‌పిస్టల్‌ విభాగంలో బివి.రోహిత్‌రెడ్డి (కడప), బి.చంద్రదీప్‌రెడ్డి (కడప), పి.సాత్విక్‌వర్ధన్‌రెడ్డి (కృష్ణ), పీప్‌సైట్‌ విభాగంలో కె.అభిరామ్‌రెడ్డి (విజయనగరం), పి.కమాల్‌స్వామి (వెస్ట్‌గోదావరి), కె.రోహిత్‌ (అనంతపురం), ఏయిర్‌రైఫిల్‌ బాలికల విభాగంలో ఎ.నేహాపట్నాయక్, పి.రోష్ని (విశాఖపట్నం), బి.సుస్మితారెడ్డి(కడప), ఏయిర్‌పిస్టల్‌ విభాగంలో డి.లక్ష్మిలాహ్య (కృష్ణ), ఎస్‌.అనూద్‌భాను (కడప), ఎం.రిషిత (గుంటూరు), పీప్‌సైట్‌ విభాగంలో ఎ.దేదీప్య (కృష్ణ), జె.అనూష (కడప), వై.శ్రీనిత్య (గుంటూరు)లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలించారు. వీరు నవంబర్‌ 26–30 వరకు హైదరాబాదర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement