నీటి కోసం వచ్చి.. కుక్కల పాలైంది.. | Deer killed in dog attack | Sakshi
Sakshi News home page

నీటి కోసం వచ్చి.. కుక్కల పాలైంది..

May 4 2016 8:23 PM | Updated on Mar 28 2018 11:26 AM

అడవిలో నీళ్లు దొరక్క గ్రామ సమీపంలోకి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడింది.

అడవిలో నీళ్లు దొరక్క గ్రామ సమీపంలోకి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడింది. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం రావులపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాలు.. స్థానిక అడవిలోంచి ఓ జింక ఉదయం దాహం తీర్చుకునేందుకు రావులపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సోలార్ ప్లాంటు వద్దకు వచ్చింది. ఈక్రమంలో నీళ్లు తాగుతున్న జింకపై వీధికుక్కలు దాడి చేశాయి.  గాయపడిన జింకను అక్కడే ఉన్న రైతులు గమనించి చేరదీసి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్ నుంచి అధికారులు రావడం ఆలస్యమవడంతో పరిస్థితి విషమించి జింక మృతి చెందింది. అనంతరం ఫారెస్టు రేంజ్ అధికారి అరుణ జింకను ఖననం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement