శ్రీశైలంలో తగ్గుతున్న నీటిమట్టం | decrease waterlevel in srisailamdam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో తగ్గుతున్న నీటిమట్టం

Oct 2 2016 12:18 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. వస్తున్న ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడం, దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది.

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. వస్తున్న ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడం, దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 48వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా, జలాశయం నుంచి 56,268 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పాదన చేస్తూ 45,043 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 9,200 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement