డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సస్పెన్షన్‌ | Data entry operator suspended | Sakshi
Sakshi News home page

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సస్పెన్షన్‌

Aug 21 2016 2:01 AM | Updated on Sep 4 2017 10:06 AM

బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టు వాణిజ్య పన్నుల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రవిబాబుని శనివారం డీసీ సస్పెండ్‌ చేశారు.

బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టు వాణిజ్య పన్నుల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రవిబాబుని శనివారం డీసీ సస్పెండ్‌ చేశారు. ఈనెల 13వ తేదీన బయటి రాష్టం నుంచి మూడు లారీలు తమిళనాడు వైపు పప్పు దినుసుల లోడుతో వెళుతున్నాయని ఆ లారీలు చెక్‌పోస్టుకు వస్తే ఆపాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించి లారీలకు యధావిధిగా పాసులు కొట్టి పంపించడం జరిగింది. దీనిపై విచారణ సాగించిన డీసీ దీనికి సంబంధించి ఆ రోజు విధుల్లో ఉన్న అధికారిని సీసీ కెమెరా ఫుటేజీలు, ఇచ్చిన పాసులో ఉన్న వివరాల ఆధారంగా బాధ్యుడిని గుర్తించి శనివారం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలు ఎగ్జిట్‌ చెక్‌పోస్టులో ఎంటర్‌ కావాల్సి ఉండగా అవి ఇన్‌కమింగ్‌ చెక్‌పోస్టులో ఎగ్జిట్‌ అవడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement