నైతిక విలువలు పెంపొందించుకోవాలి | Cultivate moral values | Sakshi
Sakshi News home page

నైతిక విలువలు పెంపొందించుకోవాలి

Dec 22 2016 10:23 PM | Updated on Jun 1 2018 8:39 PM

నైతిక విలువలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె. లక్ష్మీనారాయణ సూచించారు. 'భారత దేశంలో తయారీ –బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది.

  •  జాతీయ సదస్సులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ
  • అనంతపురం ఎడ్యుకేషన్‌ :

    నైతిక విలువలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని  రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె. లక్ష్మీనారాయణ సూచించారు.  'భారత దేశంలో తయారీ –బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లు' అనే  అంశంపై స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల  జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి అధ్యక్షత వహించారు.  లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంగ్లవిద్య ప్రాముఖ్యతను వివరించారు. 

    సమైక్య ఆలోచనలు, భావవ్యక్తీకరణ, నైతిక విలువలు,   నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడంతోపాటు,  అమెరికాలో పరిశోధన స్థాయిలో ఉన్న రోబో టెక్నాలజీ ఎలక్ట్రానిక్‌ కార్లు, జన్యు విప్లవం వల్ల ఎదుయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో వివరించారు.   ఎస్కేయూ మాజీ ఆచార్యుడు నాగేశ్వరరావు,  సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ జి. అయ్యన్న, కార్యదర్శి కె. శివరామ్, అర్థశాస్త్ర విభాగాధిపతి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్‌ కె. శ్రీధర్, డాక్టర్‌ ఎంవీ శేషయ్య, డాక్టర్‌ పీఎస్‌  లక్ష్మీ,  విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement