రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి | Couple killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

May 23 2016 1:17 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఖమ్మం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామం సమీపంలోని బ్రిడ్జిపై నుంచి బైక్ పడిపోయిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు.

ఖమ్మం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామం సమీపంలోని బ్రిడ్జిపై నుంచి బైక్ పడిపోయిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా ముకునూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు బైక్‌పై ఖమ్మం జిల్లా మణుగూరుకు సోమవారం వెళుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సరిహద్దులో దుగినేపల్లి సమీపంలోని వాగుపై ఉన్న బ్రడ్జిపైకి రాగా... బైక్ అదుపుతప్పి కిందకు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement