బావిలో దూకిన దంపతులు.. భార్య మృతి | Couple attempts suicide, woman dies | Sakshi
Sakshi News home page

బావిలో దూకిన దంపతులు.. భార్య మృతి

Oct 2 2015 5:39 PM | Updated on Jul 10 2019 7:55 PM

కుటుంబ కలహాలతో భార్యా భర్తలు బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.

కర్నూలు : కుటుంబ కలహాలతో భార్యా భర్తలు బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య నీట మునిగి మృతి చెందగా.. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చీకట్ల శ్రీనివాసులు (27)కు ఆరునెలల కిందట లావణ్య (22)తో వివాహమైంది.


దంపతులు తరచు ఘర్షణ పడేవారు. అయితే శుక్రవారం దంపతులు లావణ్య పుట్టింటికి వెళ్లవలసి ఉంది. ఈ క్రమంలో వెళ్లేందుకు బయలుదేరిన వీరు ఇద్దరు బావిలో పడటంపై పలు అనుమానాల వ్యక్తమవుతున్నాయి. కాగా వీరు దూకిన బావిలో నీరు లేవు. లావణ్య మృతిపై స్థానికులు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లావణ్య మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement