కానిస్టేబుల్స్‌పై బదిలీ వేటు | constanle transfer in anantapur onetown | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్స్‌పై బదిలీ వేటు

May 7 2017 11:20 PM | Updated on Aug 21 2018 9:20 PM

విధి నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కానిస్టేబుల్స్‌ను బదిలీ చేస్తూ ఎస్పీ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం సెంట్రల్‌ : విధి నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కానిస్టేబుల్స్‌ను బదిలీ చేస్తూ  ఎస్పీ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం వన్‌టౌన్‌లో నాగరాజు, రఫి, టూటౌన్‌లో ముత్యాలు, శ్రీనివాసులు, రామానాయక్, అనిల్‌కుమార్, త్రీటౌన్‌లో దేవదానం, అనిల్‌కుమార్, నరసింహులు నాయుడును బదిలీ చేశారు. అలాగే నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సూర్యనారాయణ, నరేంద్రకుమార్, నాగేంద్రప్రసాద్, బాలాజీ, నరసింహులు, సీసీఎస్‌లో రాజశేఖర్, సుధాకర్, గంగాధర్, నరసింహమూర్తి, మహిళా పోలీస్‌స్టేషన్‌లో బీమ్లానాయక్, నరసింహమూర్తి, లక్ష్మయ్య, నగేష్, పీసీఆర్‌లో మనోహర్‌రెడ్డి, నార్పలలో శ్రీనివాసులు, నూర్‌బాషా, శింగనమలలో షాషావలిపై బదిలీ వేటు పడింది. వీరిని మడకశిర, కంబదూరు, అగళి, రొళ్ళ, ఎన్‌పీకుంట తదితర ప్రాంతాలకు బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement