ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలు | constable injured | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలు

Oct 25 2016 12:01 AM | Updated on Sep 4 2017 6:11 PM

ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలు

ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలు

ఒడిశాలో జరిగి ఎన్‌కౌంటర్‌లో వంగర మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ దొంతల సతీష్‌ గాయపడ్డాడు. మావోయిస్టులు–పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సతీష్‌ కాలులోకి బుల్లెట్‌ చొచ్చుకుపోయి గాయపడినట్టు ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న అతని కుటుబం సభ్యులు, గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.

వంగర: ఒడిశాలో జరిగి ఎన్‌కౌంటర్‌లో వంగర మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ దొంతల సతీష్‌ గాయపడ్డాడు. మావోయిస్టులు–పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సతీష్‌ కాలులోకి బుల్లెట్‌ చొచ్చుకుపోయి గాయపడినట్టు ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న అతని కుటుబం సభ్యులు, గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. సతీష్‌ను చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించినట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు దొంతల రామారావు, కళావతిలు పోలీసుల సహకారంతో అక్కడకు వెళ్లారు.
 
నాలుగేళ్లు క్రితం సతీష్‌ పోలీసు ఉద్యోగంలో చేరారు. ఈయన తండ్రి రామారావు సిల్వర్‌ సామగ్రి విక్రయాలు చేస్తుంటారు. తల్లి ఇంటి వద్ద పనులు చూసుకుంటారు. ఇద్దరు చెల్లెళ్లు హేమలత, స్వాతిలు స్థానికంగా చదువుతున్నారు. వంగర ఎస్సై వై.మధుసూదనరావు, ఏఎస్‌ఐ హెచ్‌.కాంతారావు అరసాడ గ్రామానికి వచ్చి సతీష్‌ కుటుంబీకులతో మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement