నేడు కలెక్టర్‌ ఢిల్లీకి పయనం | collector went to delhi | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టర్‌ ఢిల్లీకి పయనం

Jan 22 2017 11:35 PM | Updated on Mar 21 2019 8:35 PM

జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ సోమవారం సాయంత్రం డిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ సోమవారం సాయంత్రం డిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 24న( మంగళవారం) డిల్లీలో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ సదస్సులో ఆయన పాల్గొంటారు. సదస్సుకు విధిగా హాజరు కావాలని కమిషన్‌ సభ్యురాలు కమలమ్మ ఆదేశాల మేరకు ఆయన బయలుదేరి వెళ్తున్నారు. 24న సదస్సును ముగించుకొని ఆదేరోజు రాత్రికే కర్నూలు చేరుకుంటారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ ఆకె రవికృష్ణ కూడా వెళ్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement