ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం | Cobra rattles patients at Government hospital | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం

Jan 11 2016 3:28 PM | Updated on Sep 3 2017 3:29 PM

ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం

ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం

చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఓ నాగుపాము కలకలం రేపింది.

మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఓ నాగుపాము కలకలం రేపింది. చిన్నపిల్లల వార్డు బయట సీసీ రోడ్డు పక్కన నాగు పాము ప్రత్యక్షం కావడంతో దాన్ని చూసిన వారు భయాందోళనకు లోనయ్యారు.

పాములు పట్టడంలో నేర్పరి అయిన ఇందిరానగర్ ప్రాంతవాసి ప్రమీద్ అనే యువకుడికి కబురుపెట్టారు. అతడు వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement