'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్' | cm chandrababu number 1 liar in the world | Sakshi
Sakshi News home page

'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్'

Oct 8 2015 10:25 AM | Updated on Mar 23 2019 9:10 PM

'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్' - Sakshi

'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్'

అబద్ధాల పోటీ పెడితే ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి స్థానంలో ఉంటాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు.

గుంటూరు: అబద్ధాల పోటీ పెడితే ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి స్థానంలో ఉంటాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. ఆయన అబద్ధాల్లో గిన్నీస్ బుక్లోకి కూడా ఎక్కుతాడని విమర్శించారు. ఆంధప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్ష బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష రెండో రోజుకు చేరిన సందర్భంగా అక్కడికి వచ్చిన లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడారు.

వైఎస్ జగన్ దీక్షకు అనూహ్యమద్దతు వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అక్రమంగా కోట్లు ఖర్చుపెట్టి వాహనాలు ఏర్పాటు చేస్తున్నా వచ్చేందుకు ఆసక్తి చూపని జనం.. వైఎస్ జగన్ దీక్షకు మాత్రం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పారు.  వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ప్రజలకే కాకుండా రైతులకు ఓ ధైర్యం అని చెప్పారు. మరోపక్క, దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. భారీ సంఖ్యలో న్యాయవాదులు దీక్ష ప్రాంగణానికి చేరి వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement