'బాబూ.. దమ్ముంటే పదవులు వదిలి పోరాడాలి' | cm chandrababu ministers should leave thier positions: bhumana | Sakshi
Sakshi News home page

'బాబూ.. దమ్ముంటే పదవులు వదిలి పోరాడాలి'

Oct 8 2015 1:58 PM | Updated on Mar 23 2019 9:10 PM

'బాబూ.. దమ్ముంటే పదవులు వదిలి పోరాడాలి' - Sakshi

'బాబూ.. దమ్ముంటే పదవులు వదిలి పోరాడాలి'

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటుకు కోట్లు కేసు భయం పట్టుకుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటుకు కోట్లు కేసు భయం పట్టుకుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ భయం వల్లే చంద్రబాబు కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని ఆరోపించారు. తరుచూ ఢిల్లీకి వెళుతున్న బాబు ప్రత్యేక హోదాపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

వైఎస్ జగన్పై టీడీపీ మంత్రులు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ఉద్యమిస్తున్న జగన్పై చేతిగాని తనం వల్లే నిందలు వేస్తున్నారని చెప్పారు. దమ్ముంటే కేంద్రంలో మంత్రి పదవులు వదిలి ప్రత్యేక హోదాపై పోరాడాలని సవాల్ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement