బాలికపై చర్చి పాస్టర్‌ అత్యాచారయత్నం | church faster trying to rape the girl | Sakshi
Sakshi News home page

బాలికపై చర్చి పాస్టర్‌ అత్యాచారయత్నం

Sep 7 2017 7:29 AM | Updated on Jul 28 2018 8:53 PM

బాలికపై చర్చి పాస్టర్‌ అత్యాచారయత్నం - Sakshi

బాలికపై చర్చి పాస్టర్‌ అత్యాచారయత్నం

ప్రజలకు మంచిని బోధించే పాస్టర్‌ బుద్ధి వక్రమార్గం పట్టింది. ఒక బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించిన సంఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
పోలీసుల అదుపులో కామాంధుడు


రేణిగుంట : ప్రజలకు మంచిని బోధించే పాస్టర్‌ బుద్ధి వక్రమార్గం పట్టింది. ఒక బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించిన సంఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థాని కుల కథనం మేరకు.. రేణిగుంట మండలం కుర్రకాల్వ పద్మానగర్‌లో నివాసముంటున్న చర్చి పాస్ట ర్‌ పన్నీరు సెల్వం (54) నాలుగు రోజుల క్రితం తన ఇంటి సమీపంలో ఉం టున్న ఒక బాలిక(12)ను మాయమాటలతో ఇంటిలోకి తీసుకెళ్లాడు.

ఆమెతో మత్తు మందు కలిపిన శీతల పానీయాన్ని తాగించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే బాలిక తేరుకుని కేకలు వేయడంతో స్థానికులు కామాంధునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు పన్నీరుసెల్వంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించినట్టు రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. బాలికపై కన్నేసిన కామాంధుడు మూడు నెలలుగా కోరిక తీర్చమని వేధిస్తున్నట్లు సమాచారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement