తిరుమలలో చిరుత కలకలం | chetah found in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో చిరుత కలకలం

Jun 12 2016 2:16 PM | Updated on Oct 1 2018 5:19 PM

తిరుమల కాలిబాట లగేజ్ కౌంటర్ వద్ద ఆదివారం చిరుతపులి ప్రత్యక్షం కావటంతో భక్తులు భయాందోళనకు లోనయ్యారు.

తిరుమల: తిరుమల కాలిబాట లగేజ్ కౌంటర్ వద్ద ఆదివారం చిరుతపులి ప్రత్యక్షం కావటంతో భక్తులు భయాందోళనకు లోనయ్యారు. రెండు రోజుల క్రితం హంపీ మఠం వద్ద చిరుతపులి సంచరిస్తూ సీసీ టీవీ ఫొటేజీకి చిక్కిన విషయం తెలిసిందే. చిరుత పులి సంచారంపై భక్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు టీటీడీ అధికారులు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగానే.. మరోసారి భక్తులకు చిరుత కనిపించడం కలకలం రేపుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement