చెస్‌ చాంపియన్‌షిప్‌ ఎంపిక | chess champioship selection | Sakshi
Sakshi News home page

చెస్‌ చాంపియన్‌షిప్‌ ఎంపిక

Jul 20 2016 10:29 PM | Updated on Sep 4 2017 5:29 AM

చెస్‌ చాంపియన్‌షిప్‌ ఎంపిక

చెస్‌ చాంపియన్‌షిప్‌ ఎంపిక

అహ్మదాబాద్‌(గుజరాత్‌)లో ఈనెల 22 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించే జాతీయ అండర్‌–13 బాలుర చెస్‌ చాంపియన్‌షిప్‌ ఏపీ జట్టుకు జె.అక్షిత్‌కుమార్, బీజేఎస్‌కే రణధీర్‌ ఎంపికయ్యారు.

విజయవాడ స్పోర్ట్స్‌ : 
అహ్మదాబాద్‌(గుజరాత్‌)లో ఈనెల 22 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించే జాతీయ అండర్‌–13 బాలుర చెస్‌ చాంపియన్‌షిప్‌ ఏపీ జట్టుకు   జె.అక్షిత్‌కుమార్, బీజేఎస్‌కే రణధీర్‌ ఎంపికయ్యారు. గ్లోబల్‌ చెస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న వీరిద్దరూ గత నెల మూడు నుంచి ఐదో తేదీ వరకు రాజమండ్రిలో ఏపీ చెస్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా మొదట రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. జె.అక్షిత్‌కుమార్‌ ప్రస్తుతం నొయిడా నేషనల్‌æప్రీమియం చెస్‌ టోర్నీ ఆడుతున్నాడు. జట్టులో బీజేఎస్‌కే రణధీర్‌ బుధవారం అహ్మదాబాద్‌కు పయనమయ్యాడు. గ్లోబల్‌ చెస్‌ అకాడమీలో బుధవారం రణధీర్‌ను గ్లోకల్‌ టెక్నాలజీస్‌  సీఈఓ తరుణ్‌ కాకాని అభినందించి నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో గ్లోబల్‌ చెస్‌ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాజేంద్ర, ఎస్‌కే ఖాసీం, ఏపీ చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి డి.శ్రీహరి పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement