అంతరాష్ట్ర ఆ¯ŒSలై¯ŒS మోసగాడిని రాజమహేద్రవరం పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాల మేరకు టూ టౌ¯ŒS ఇ¯ŒSస్పెక్టర్ ఆర్‌జే రవికుమార్ సిబ్బందితో నిందితుడిని నెల్లూరులో అరెస్టు చేశారు.
-
రూ.1.50 కోట్ల వరకు వసూళ్లు
-
ఇతర రాష్ట్రాలలో కూడా మోసాలు
రాజమహేంద్రవరం క్రైం :
అంతరాష్ట్ర ఆ¯ŒSలై¯ŒS మోసగాడిని రాజమహేద్రవరం పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాల మేరకు టూ టౌ¯ŒS ఇ¯ŒSస్పెక్టర్ ఆర్‌జే రవికుమార్ సిబ్బందితో నిందితుడిని నెల్లూరులో అరెస్టు చేశారు. తూర్పు మండలం డీఎస్పీ కె.రమేష్ బాబు సోమవారం రాజమహేంద్రవరం టూ టౌ¯ŒS పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. నెల్లూరుకు చెందిన చిలక చంద్రమౌళిరెడ్డి, మరో ఇద్దరు రామగుండం రమేష్, సతీష్ రెడ్డిలతో కలసి 2015 జనవరిలో రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద గల పెట్రోల్ బంక్ వెనుక ఒక అపార్ట్‌మెంట్‌లో హోష¯ŒS మీడియా ఐటీ సొల్యూష¯Œ్స పేరుతో ఒక కార్యాలయం ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా కస్టమర్ల నుంచి రూ.200 చొప్పున అప్లికేష¯ŒS ఫీజుగా కట్టించుకుని మరో 15 రోజుల్లో మీరు కట్టిన డబ్బుకు రెట్టింపు నగదు వస్తుందని ఎస్సెమ్మెస్‌ల ద్వారా తెలిపారు. ఇలా సుమారు 280 మంది నుంచి రూ.1.5 కోట్లు వసూలు చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితులు ఆ నగదుతో ఎక్కువగా గోవా వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి జల్సాలు చేసేవారని తెలిపారు. దానిలో కొంత మొత్తంతో పెట్రోల్ బంక్ లీజ్‌కు తీసుకున్నారని, అలాగే ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేశారన్నారు.
ఒకరు పరారీలో.. మరొకరు జైలులో..
నిందితులు ముగ్గురూ నెల్లురు జిల్లాకు చెందిన వారుగా డీఎస్పీ తెలిపారు. వీరిలో రామగుండం రమేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి తిరుపతి జైలులో ఉన్నాడని, మరో నిందితుడు సతీష్ రెడ్డి పరారీలో ఉన్నాడని ఇతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ముగ్గురిపై ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా, తదితర రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడినట్లు ఆయా రాష్ట్రాల నుంచి సమాచారం అందినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతర రాష్ట్రలతో కలిపితే పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడు చిలకా చంద్రమౌళి రెడ్డిని ఈ నెల 23న సాయంత్రం ఐదు గంటలకు అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1.50 లక్షలు నగదు, ఏపీ 09 బీబీ 1401 ఇండిగో ఎల్‌ఎస్ కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
పోలీస్ సిబ్బందికి రివార్డు
ఆ¯ŒSలై¯ŒS మోసగాడిని అరెస్ట్ చేయడంలోను, కేసు దర్యాప్తు చేయడంలో ప్రతిభ చూపిన టూ టౌ¯ŒS ఇ¯ŒSస్పెక్టర్ జేఆర్ రవికుమార్ సిబ్బందికి రివార్డు ఇచ్చేలా పై అధికారులకు సిఫార్స్ చేస్తామని డీఎస్పీ తెలిపి వారికి అభినందనలు తెలిపారు.