చెక్ బౌన్స్ కేసులో గుంటూరు జిల్లా నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు మేనకోడలు పులపర్తి విజయలక్ష్మిని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరంలోని షాడే గర్ల్స్ హైస్కూలుకు చెందిన 15 వేల గజాల స్థలాన్ని 49 సంవత్సరాల లీజుకు తీసుకునేందుకుగాను మొదటి లీజుదారైన నక్కా విల్సన్‌తో ఆమె ఒప్పందం చేసుకొని ఇచ్చిన రూ.47 లక్షల చెక్కు బౌన్స్ అవడంతో 2011లో కేసు వేశారు. విచారించిన కోర్టు విజయలక్ష్మిని అ
చౌక్‌బౌన్స్ కేసులో ఎంపీ రాయపాటి మేనకోడలి అరెస్టు
Sep 23 2016 9:18 PM | Updated on Aug 20 2018 4:44 PM
రాజమహేంద్రవరం :
చెక్ బౌన్స్ కేసులో గుంటూరు జిల్లా నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు మేనకోడలు పులపర్తి విజయలక్ష్మిని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరంలోని షాడే గర్ల్స్ హైస్కూలుకు చెందిన 15 వేల గజాల స్థలాన్ని 49 సంవత్సరాల లీజుకు తీసుకునేందుకుగాను మొదటి లీజుదారైన నక్కా విల్సన్‌తో ఆమె ఒప్పందం చేసుకొని ఇచ్చిన రూ.47 లక్షల చెక్కు బౌన్స్ అవడంతో 2011లో కేసు వేశారు. విచారించిన కోర్టు విజయలక్ష్మిని అరెస్ట్ చెయ్యాలని న్యాయస్థానం ఆదేశించింది.
Advertisement


