పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసిన సీఎం | chandrababu release water from pattiseema project | Sakshi
Sakshi News home page

పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసిన సీఎం

Jul 6 2016 12:13 PM | Updated on Aug 20 2018 6:35 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు. 24 పంపుల ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని ఆయన విడుదల చేశారు. అంతకుమందు.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పట్టిసీమ వద్ద పొగాకు రైతులకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. కనీసం తమ సమస్యను సీఎంకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడంలేదని పొగాకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement